టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఓ భిన్నమైన అమ్మాయి. చాలా విలక్షణంగా ఆలోచిస్తుంది. నచ్చినట్లు బ్రతకడమే లైఫ్. ఒకరి కోసం కాంప్రమైజ్ కాకూడదని నమ్ముతుంది. తన ప్రతి నిర్ణయంలో ఈ భావాలు కనిపిస్తాయి. సమాజం అనే ఛట్రం లో ఇరుక్కుపోయి జీవించడం సరికాదు అంటుంది. గత రెండేళ్లుగా సమంత వ్యక్తిగత జీవితం ఒడిదుడుకులకు లోనవుతుంది. భర్త నాగ చైతన్యతో విభేదాలు తల్తెట్టాయి. దాంతో విడాకులు తీసుకున్నారు.
ఈ క్రమంలో నిందలు, ఆరోపణలు, సోషల్ మీడియా ట్రోల్స్ ఎదుర్కొన్నారు. మానసిక ఒత్తిడికి గురయ్యారు. సమంతను ఓ వర్గం కార్నర్ చేశారనే వాదన ఉంది. విడాకులు బాధ నుండి బయటపడగానే మరో సమస్య ఆమెను చుట్టుముట్టింది. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి ఆమెనుకు సోకింది. ఏడాది కాలంగా ఈ వ్యాధికి సమంత చికిత్స తీసుకుంటుంది. ఇటీవల సమంత సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చారు. విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే సమంతకు పెళ్లీడు దాటిపోతుంది. ఆమె ప్రస్తుత వయసు 36 ఏళ్ళు. వెంటనే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఏజ్ బార్ అవుతుంది. ఈ క్రమంలో పేరెంట్స్ నుండి ఆమె మీద ఒత్తిడి ఉంది. వివాహం చేసుకుని సెటిల్ అవ్వు. నువ్వు లైఫ్ లో సక్సెస్ అనేది చూసేశావు అని సలహా ఇస్తున్నారట సన్నిహితులు. అయితే సమంతకు జీవితంలో పెళ్లి చేసుకునే ఆలోచన లేదట. ఇకపై ఒంటరిగా ఉండిపోవాలి అనుకుంటున్నారట. మిగిలిన జీవితం నటనకు, సోషల్ వర్క్ కి ఉపయోగించాలని భావిస్తున్నారట. ఇక తల్లి కావాలన్న ఆశను వేరే మార్గంలో తీర్చుకుంటారట. ఆమె ఇద్దరు పిల్లలను భవిష్యత్ లో దత్తత తీసుకోవాలి అనుకుంటున్నారట.