హాలివుడ్ సినిమాస్ లో మార్వెల్ యూనివర్స్ తెరెక్కించే సూపర్ హీరో సినిమాలకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మార్వెల్ సిరీస్ నుంచి రిలీజ్ అయిన ఏ సినిమా అయినా బ్లాక్ బస్టర్ అవ్వాల్పిందే.. అలాగే 2016లో మార్వెల్ యూనివర్స్ నుంచి వచ్చిన డాక్టర్ స్ట్రేంజ్ మూవీ కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఆరేళ్ల తర్వాత దానికి సీక్వెల్‌గా వచ్చిందే “డాక్టర్ స్ట్రేంజ్: ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్”. బెనడిక్ట్ కుంబర్ బ్యాచ్, ఎలిజబెత్ ఓల్సన్, జోచిటి గోమెజ్, వాండా మ్యాక్సిమాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ విజువల్ ఎఫెక్ట్స్‌తో అదరగొట్టింది. ఈవిల్ డెడ్ డైరెక్టర్ సామ్ రైమీ రూ.1500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా గత నెల 6న విడుదలై బాక్సాఫిస్ వద్ధ వేల కోట్లు రాబట్టింది. డాక్టర్ స్ట్రేంజ్ పార్ట్ వన్ చూసినవారికి ఈ సీక్వెల్ బాగా అర్థమవుతుంది.
కాగా.. డాక్టర్ స్ట్రేంజ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పించి మార్వెల్ యూనివర్స్ సంస్థ.. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ సంబంధించి అప్ డేట్ ఇచ్చింది మార్వెల్ యూనివర్స్. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో జూన్ 22 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టు ప్రకటించింది. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు హాట్‌స్టార్ ప్రకటించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..