మా అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో ఒకరిపై ఒకరు ఇండస్ట్రీలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈసారి పోటీలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, నటి హేమ సిద్ధమయ్యారు. అయితే ఈసారి కొత్తగా లోకల్ నాన్ లోకల్ వివాదం తెరపైకి వచ్చింది. అలాగే మా అసోసియేషన్ భవనంపై కూడా రచ్చ నడుస్తోంది. ఇక ఇదే విషయం పై నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల విషయంలో లోకల్ నాన్ లోకల్ విషయాన్ని పట్టించుకోనని అలాగే ఇండస్ట్రీ సమస్యలను బహిరంగంగా చర్చించడం సరికాదన్నారు. తెలంగాణ సర్కార్ తో రాసుకుపూసుకు తిరుగుతున్నారు మా శాశ్వత భవనాన్ని ఇంతకాలం ఎందుకు నిర్మించలేక పోయారని బాలకృష్ణ ప్రశ్నించారు.
బిల్డింగ్ కోసం అడిగితే ఒక ఎకరా భూమి కూడా ఇవ్వరా… మా ఫండ్ రైజింగ్ కార్యక్రమం అంటూ ఫస్ట్ క్లాస్ టికెట్ లు వేసుకుని విమానాల్లో తిరిగారు. ఆ డబ్బులు ఏం చేశారని ప్రశ్నించారు. ఇక బిల్డింగ్ విషయంలో ముందుకు వచ్చిన విష్ణుకు సహకరిస్తానని అందరం కలిస్తే మా కోసం ఇంద్రభవనం లాంటి అద్భుతమైన భవనాన్ని నిర్మించుకోవచ్చు అని అన్నారు బాలయ్య.