Thursday, November 21, 2024

మెగాస్టార్ ఆక్సిజన్ బ్యాంక్ ఖర్చు ఎంతో తెలుసా ?

మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాలలో విపత్కర పరిస్థితుల్లో ఎన్నోసార్లు ఎంతోమందికి అండగా నిలిచారు. ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ ఇలా చాలానే స్థాపించారు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో కోటి రూపాయల విరాళం ప్రకటించారు మెగాస్టార్. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న వారికి అండగా తెలుగు రాష్ట్రాలలో ఆక్సిజన్ బ్యాంక్ లను ప్రారంభించాడు.

అయితే అందుకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కార్యక్రమానికి చిరు రామ్ చరణ్ పది కోట్లకు పైగా ఖర్చు పెట్టారని మొదట టాక్ నడిచింది. కానీ నిజానికి 30 కోట్లకు పైగానే తమ సొంత డబ్బుతో పంపిణీ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సహాయం పట్ల మెగాస్టార్ చిరంజీవిపై సినీ రాజకీయ ప్రముఖులు చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement