Tuesday, November 26, 2024

ప్రభాస్ పై ఇష్టాన్ని బయటపెట్టిన దివి

బిగ్ బాస్ షో తో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి దివి. అదే జోష్ తో వరుస అవకాశాన్ని కూడా దక్కించుకుంటుంది. ఇదిలా ఉండగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో డేటింగ్ సిద్ధమంటూ చెప్పుకొచ్చింది. అందరిలానే నాకు ప్రభాస్ అంటే క్రష్. ఆయన మూవీస్ చూస్తున్న నచ్చుతున్నాడు. ఇంకా ఇంకా నచ్చుతాడు. నాకు ఎలాగైతే ఇంస్టాగ్రామ్ మెసేజ్ లు వస్తాయో… నేను కూడా ప్రభాస్ కి అలానే ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టాను. ఐ లవ్ యు సో మచ్ ప్రభాస్ అని. ఒక్కసారి చూస్తే చాలు… ఒకసారి కలిస్తే చాలు.. మిర్చి లో పడిపోయాను. ఆ తర్వాత కూడా పడిపోతూనే ఉన్నాను.

ప్రభాస్ ని ఇప్పటిదాకా చూడలేదు. కానీ ఆయన చాలా మంచి వ్యక్తి అని విన్నాను. ఒకవేళ ఆయన కలిస్తే ఓ డీసెంట్ డేట్ అడుగుతా. మిర్చి లాంటి కుర్రోడితో కలిసి ఓ కాఫీ తాగితే చాలు. నాకు తెలిసి ఆ రోజు వస్తుంది. ఆయన్ను తప్పకుండా కలుస్తా అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement