Wednesday, November 20, 2024

వివాహ వ్య‌వ‌స్థ‌పై మ‌రోసారి విరుచుకుప‌డిన‌ ‘రామ్ గోపాల్ వ‌ర్మ‌’

వివాహంతో కొనితెచ్చుకునే ప్ర‌మాదాల గురించి యువ‌త‌ను హెచ్చ‌రించేందుకు స్టార్ విడాకులు మంచి ట్రెండ్ సెట్ట‌ర్స్ అని త‌న‌దైన స్టైల్ లో స్పందించారు ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఇంకా వివాహ వ్య‌వ‌స్థ‌పై ఏమ‌న్నారంటే..
తాజాగా తమిళ నటుడు ధనుష్, ఐశ్వర్యతో విడిపోతున్నట్టు ప్రకటించగా.. ఇటీవలే నాగచైనత్య, సమంత జంట కూడా విడిపోవ‌డం తెలిసిందే. ఈ క్రమంలో వివాహ బంధంపై స్వతహాగా నమ్మకం లేని వర్మ తన అభిప్రాయాల‌ను తెలియ‌జేందుకు విడిపోయిన జంటల‌ను అవకాశంగా తీసుకున్నారు.

విడాకులను సంగీత్ కార్యక్రమంతో వేడుకలా చేసుకోవాలి. ఎందుకంటే స్వేచ్ఛను పొందుతున్నందుకు.

ఒకరిలోని ప్రమాదకర లక్షణాలను మరొకరు పరీక్షించుకునేందుకే పెళ్లిళ్లు.

మన దుష్ట పూర్వీకులు సమాజంపై రుద్దిన పాపిష్టి ఆచారమే వివాహం. అసంతృత్తి, విచారంతో నిరంతరం కొనసాగేందుకే ఇది.

ప్రేమను పెళ్లికి మించి వేగంగా చంపేసేది మరేదీ లేదు. సంతోషానికి రహస్యం ఏమిటంటే.. జైలుకు వెళ్లడం లాంటి పెళ్లి చేసుకోవడం కంటే వీలైనంత కాలం ప్రేమిస్తూ ఉండడమే.

- Advertisement -

పెళ్లిలో ఉండే ప్రేమ ఆ వేడుక జరిగే అన్ని రోజుల కంటే తక్కువే ఉంటుంది. 3 నుంచి 5 రోజులు.

తెలివైన వారు ప్రేమిస్తారు.. మూర్ఖులు పెళ్లి చేసుకుంటారని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement