Friday, November 22, 2024

ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు బ‌ర్త్ డే..

నేడు ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు పుట్టిన‌రోజు. కాగా ఈ ద‌ర్శ‌కేంద్రుడు ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీని ఏర్పాటు చేసుకున్నారు.కేవలం వెండితెరమీదే కాక బుల్లితెర మీద కూడా రాఘవేంద్రరావు తన ముద్ర వేశారు. ప్రముఖ టీవీ ఛానెల్ లో ప్రసారమైన శాంతి నివాసం అనే సీరియల్ కు రచయిత, దర్శకత్వ పర్యవేక్షకుడిగా వ్యవహరించారు ఈ లెజెండ్రీ డైరెక్టర్. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సినిమా తారలు విషెస్ తెలుపుతున్నారు. రొమాంటికి పాటలకు ఆయన పెట్టింది పేరు. అలాగే భక్తిరస సినిమాలు తీయడంలోనూ ఆయ‌న దిట్ట. అన్నమయ్య, శ్రీరామదాసు సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు రాఘవేంద్రరావు. కాగా రాఘవేంద్ర రావు ప్రతిభకు ఎన్నో అవార్డులు వరించాయి. ఆయన ప్రస్తుతం సినిమాలు తగ్గించేశారు. నందమూరి తారకరామారావు నుంచి మెగాస్టార్ చిరంజీవి, నేటి జనరేషన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరకూ ఎంతోమంది హీరోలతో సినిమాలు చేసారు.

అలాగే ఆయన వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి వాళ్ళని తెలుగు సినిమాకి హీరోలుగా పరిచయం చేసాడు. ఇక అతిలోక సుందరి శ్రీదేవి, కుష్బూ, టబు, దీప్తి భట్నాగర్, శిల్ప శెట్టి, తాప్సి లాంటి ఎందరో హీరోయిన్స్ ని కూడా ఆయన తెలుగు సినిమాకి పరిచయం చేశారు. రాఘవేంద్రరావు మొత్తం ఎనిమిది నంది పురస్కారాలు, ఒక IIFA పురస్కారం, ఒక సైమా అవార్డు, ఐదు ఫిల్మ్ ఫేర్ సౌత్ పురస్కారాలు, రెండు సార్లు సినీ మా అవార్డులు అందుకున్నారు రాఘవేంద్రరావు. దర్శకుడిగా ఆయన మొదటి చిత్రం 1975లో వచ్చిన బాబు. ఈ చిత్రంలో శోభన్ బాబు, వాణిశ్రీ, లక్ష్మి ముఖ్య పాత్రల్లో నటించారు. ఆ తర్వాత ఎంతో మంది కథానాయకులతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశారు. స్త్రీ పాత్రలే ప్రధానంగా జ్యోతి, ఆమె కథ, కల్పన లాంటి చిత్రాలు తీశారు..శ్రీదేవితో రాఘవేంద్రరావు 24 సినిమాలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement