సైతాన్ వల్గర్ సిరీస్ కాదని..చూడటం..చూడకపోవడం మీ ఇష్టమన్నారు దర్శకుడు మహి వి రాఘవ్. కాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ లో సైతాన్ తెలుగు వెబ్ సిరీస్ రానుంది. మహి వి రాఘవ్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసినవారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అందుకు కారణం ఈ ట్రైలర్లో కనిపించిన హింస నేపథ్యంలోని సన్నివేశాలు, అశ్లీలత .. అసభ్యతగా అనిపించే సంభాషణలు. దాంతో ఒక తెలుగు వెబ్ సిరీస్ లో ఈ స్థాయి విపరీత దృశ్యాలా అంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. మోతాదు మించిన దృశ్యాల పట్ల చాలామంది అసహనాన్ని ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో మహి వి రాఘవ్ స్పందించారు..ఇది వల్గర్ వెబ్ సిరీస్ కాదు .. క్రైమ్ వరల్డ్ ను బేస్ చేసుకుని నడిచే కథ. అందువలన ఆ మాత్రం ఘాటైన దృశ్యాలు .. డైలాగ్స్ ఉంటాయి. ఈ కంటెంట్ ఎలాంటిది అనే విషయంలో ముందునుంచే మేం హెచ్చరికలు చేస్తూనే వస్తున్నాం అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement