Friday, November 22, 2024

తెలుగు సినిమా పరిశ్ర‌మలో బ‌ల‌గం ఓ చ‌రిత్ర‌..

‘బలగం’ సినిమా దూసుకెళుతోంది. ఈ సినిమా ప్రభావం గడపగడపకు కనిపి స్తోంది. థియేటర్లలో ప్రదర్శిస్తున్నప్పటికీ, మరోవైపు గ్రామాల్లో తెరలు ఏర్పాటుచేసుకు ని ఊరు ఊరంతా వీక్షిస్తున్నారు. ఈ పరిణా మం పట్ల చిత్ర యూనిట్‌ హర్షం వ్యక్తం చేసిం ది. దిల్‌ రాజు సారథ్యంలో శిరీష్‌ సమర్పణ లో దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై హర్షిత్‌, హన్షిత నిర్మించిన సినిమా ‘బలగం’. ప్రియ దర్శి, కావ్యా కళ్యాణ్‌ రామ్‌ హీరో హీరోయి న్లుగా నటించారు. వేణు ఎల్దండి దర్శకుడు. బలగం సినిమాకు 7 ఇంటర్నేషనల్‌ అవార్డులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఏర్పాటు- చేసిన పాత్రికేయుల సమావేశంలో దిల్‌ రాజు, దర్శకుడు వేణు, నిర్మాతలు హర్షిత్‌, హన్షిత తదితరులు పాల్గొన్నారు.

ఈ ప్రెస్‌మీట్‌లో దిల్‌ రాజు మాట్లాడుతూ ”మంచి సినిమా తీస్తున్నామని, మంచి సినిమా అవుతుం దనే నమ్మకంతో బలగం సినిమాను మొదలు పెట్టాం. కానీ ఈరోజు అదొక చరిత్ర. తెలుగు సినిమాలో బలగం ఓ మైలురాయిలా నిలబడిపోయేలా ముందుకెళు తోంది. సినిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే తెలుగు సినిమా పరిశ్రమలో బలగం ఎప్పుడూ నిలబడిపోయే ఓ చరిత్ర.
వేణు నిన్న ఒక వీడియో పంపాడు. అందులో అన్నదమ్ములు ఈ సినిమా చూసి ఊరి సర్పంచు ముందు కలిసిపోయారు. అలాగే ఓ కుటు-ంబంలో విడిపోయిన వారందరూ కలిసి బలగం సినిమాను చూశారు. బుధవారం (ఏప్రిల్‌ 5)కి నిర్మాతగా నేను జర్నీ స్టార్ట్‌ చేసి 20 ఏళ్లు అవుతుంది. ఇన్నేళ్లలో బొమ్మరిల్లు సమయంలో నాకొక అనుభూతి. ఆ సినిమా చూసిన తర్వాత చాలా మంది పేరెంట్స్‌లో మార్పు వచ్చింది.
హర్షిత్‌, హన్షితలు బలగం సినిమాను రిలీజ్‌ చేయటాని కంటే ముందే ఇంటర్నేషనల్‌ అవార్డులకు పంపారు. 7 ఇంటర్నేషనల్‌ అవార్డ్స్‌ వచ్చాయి.
పల్లెటూళ్లలో మేమేదో షోను ఆపుతున్నామంటూ వార్తలు వస్తున్నాయి. జనాలు ఎలాగైనా మంచి సినిమాను చూడాలనే బలగంను రూపొందించాం. మంచి సినిమా చేశామని అనుకున్నాం కానీ.. గొప్ప సినిమా చేశామని ఇప్పుడే తెలిసింది. నేను చెప్పే ది ఒక్కటే సినిమా ఎక్కడా ఆగదు. ఓపెన్‌గా ఎక్కడ చూడాలనుకుంటే అలా చూడం డి.
బలగం సినిమాను ఆస్కార్‌కు పంపించేలా చర్యలు తీసుకుంటాం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement