Wednesday, November 20, 2024

మాజీ ప్రియుడి విషెస్ కి రష్మీక ఏమని రిప్లయ్ ఇచ్చిందో చూశారా ?

ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ రష్మిక మందన్న. కెరీర్ ఆరంభంలో కాస్త నెమ్మదిగా ప్రారంభించినప్పటికీ ఆ తరువాత మంచి జోష్ తో సినిమాలను చేస్తూ వస్తోంది. గతేడాది భీష్మ, సరిలేరు నీకెవ్వరు వంటి సూపర్ డూపర్ హిట్ లను అందుకుంది. ఇటీవల సుల్తాన్ సినిమా తో కూడా మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తోంది.

ఇదిలా ఉండగా సోమవారం ఏప్రిల్ 5న రష్మిక మందన్న బర్త్ డే. ఈ సందర్భంగా ఆమె మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి ఓ బహుమతి ని ఇచ్చాడు. నీ కిరిక్ పార్టీ ఆడిషన్ కి సంబంధించిన ఓ అందమైన అనుభవాన్ని షేర్ చేస్తున్నాను. అప్పటినుంచి నువ్వు ఎంతో దూరం ప్రయాణించావు. నీ కలలు సాకారం చేసుకునేందుకు ఓ యోదిరాలిగా పోరాడుతున్నావు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. హ్యాపీ బర్త్ డే టూయు అంటూ రక్షిత్ పేర్కొన్నారు.

ఇక రక్షిత్ ట్వీట్ పై రష్మిక మందన్న కూడా స్పందించారు. అవును ఇది నాకు చాలా స్పష్టంగా గుర్తుంది. రక్షిత్ థాంక్యూ ….ఇది ఎంతో విలువైనది అంటూ రష్మిక మందన్న పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement