ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో స్టాలిన్ ఘన విజయం సాధించి సీఎంగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా చెపాక్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఉదయనిధి రాజకీయాల్లోకి రాకముందు సినిమాల్లో బిజీ బిజీగా గడిపారు. ఇప్పుడు రాజకీయంలో లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సినిమాలకు ఉదయనిధి స్టాలిన్ గుడ్ బై చెప్పబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.
నిజానికి ఉదయనిధి స్టాలిన్ 2008లో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. మొదట నిర్మాతగా స్టార్ట్ చేసి 2012లో ఓరు కల్ ఓరు కన్నడి (తెలుగులో ఓకే ఓకే) సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ ఎమ్మెల్యే గా ఎన్నిక కావటంతో సినిమాలకు గుడ్ బై చెబుతాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా ఈ విషయమై అధికారిక ప్రకటన మాత్రం ఎక్కడా రాలేదు. ప్రస్తుతం ఉదయనిధి మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.