మామూలుగా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథ మీరు హీరో చేస్తూ ఉంటాడు. ఇలా చాలాసార్లు ఇది వరకు జరిగింది. ఇప్పుడు అలాంటి సంఘటనే మళ్లీ జరిగింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తో ఓ కథను చెప్పాడట. ఆ కథ నచ్చడంతో ప్రవీణ్ సత్తారుకు ఓకే చెప్పాడట. నిజానికి ఆ కథను మొదట రామ్ కోసం ప్రవీణ్ సత్తారు రాసుకున్నాడట. రామ్ కి కూడా ఆ కథ చెప్తే ఓకే అన్నాడట. కానీ బడ్జెట్ ఎక్కువ అవుతుండడంతో ఆ సినిమా ఆగిపోయిందట.
అదే కథను ఇప్పుడు మెగా ప్రిన్స్ తో ఓకే చేశాడు ప్రవీణ్ సత్తారు. మరోవైపు ఎనర్జిటిక్ స్టార్ రామ్ లింగ స్వామి తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ కథ కూడా మొదట లింగస్వామి అల్లు అర్జున్ కోసం రాసుకున్నాడట. కానీ కొన్ని కారణాల వల్ల అది అయిపోయింది. దీనితో రామ్ తో సినిమాకి రెడీ అయ్యాడు లింగస్వామి. మరి ఈ రెండు సినిమాలలో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకుంటుందో చూడాలి.