Saturday, November 23, 2024

అఖండ కు బాలకృష్ణ రెమ్యునరేషన్ తగ్గించుకున్నాడా ?

నందమూరి బాలకృష్ణ హీరోగా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అఖండ. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ ని కూడా సంపాదిస్తోంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.

అది ఏంటంటే ఒక సినిమాకు 10 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే బాలకృష్ణ…ఈ సినిమాకు కేవలం ఏడు కోట్ల రూపాయలు మాత్రమే తీసుకున్నారట. 70 కోట్ల భారీ బడ్జెట్ అఖండ చిత్రం తెరకెక్కుతోంది. అయితే నిర్మాతలు నాన్ ప్రొడక్షన్ కాస్ట్ ను మాత్రం తగ్గించాలని ముందుగానే నిర్ణయించుకున్నారట. ఆ కారణంతోనే బాలయ్యకు తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక గతంలో బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో సింహా లెజెండ్ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement