Monday, November 25, 2024

Dhanush : ఆ కేసులో ధ‌నుష్ కు ఊర‌ట…

పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ధనుష్‌ తమ కుమారుడు అని పేర్కొంటూ మేలూర్‌ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ని మద్రాసు హైకోర్టు, మదురై ధర్మాసనం కొట్టివేసింది. మేలూర్‌కి చెందిన కదిరేశన్‌, మీనాక్షి దంపతులు.. నటుడు ధనుష్‌ తమ కుమారుడని 2015లో మేలూర్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

ధనుష్‌ తమ కుమారుడే అని నిరూపించడానికి సాక్ష్యాధారాలుగా బర్త్‌ సర్టిఫికేట్, టెన్త్‌ క్లాస్‌ టీసీ, 2002లో ఉద్యోగం కోసం ఎంప్లాయిమెంట్‌ కార్యాలయంలో ధనుష్‌ తన పేరును నమోదు చేసుకున్న సర్టిఫికేట్‌లను గతంలో వారు కోర్టుకు సమర్పించారు.

పుట్టుమచ్చలతో కేసు క్లియర్‌
కదిరేశన్, మీనాక్షి చేస్తున్న వాదనల్లో నిజం లేదంటూ ధనుష్‌ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించడంతో పాటు కొన్ని ఆధారాలు సమర్పించారు. అయితే కదిరేశన్‌ సమర్పించిన టీసీలో పుట్టుమచ్చలు ఉన్నాయి. ధనుష్‌ న్యాయవాదులు సమర్పించిన టీసీలో పుట్టుమచ్చలు లేవు. దీనిపై న్యాయమూర్తి ప్రశ్నించగా అసలు కదిరేశన్‌ దంపతులు పేర్కొన్న పుట్టుమచ్చులు ధనుష్‌కు లేవని అతడి తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. దీంతో కొన్ని రోజుల క్రితం ధనుష్‌ వ్యక్తిగతంగా కోర్టుకు హజరయ్యారు.
కోర్టు రిజిస్టార్‌ సమక్షంలో మేలూర్‌ రాజాజీ ప్రభుత్వాసుపత్రి డీన్‌ ధనుష్‌ పుట్టుమచ్చలను పరిశీలించారు. ధనుష్‌కు పుట్టుమచ్చలు లేవని తేలడంతో కదిరేశన్ పిటిషన్‌ను కొట్టివేశారు. సుమారు ఎనిమిదేళ్ల పాటు అనేక అధారాలపై విచారణ జరిపిన కోర్టు కస్తూరి రాజా, విజయలక్ష్మిలకే ధనుష్‌ జన్మించినట్లు తీర్పును వెళ్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement