Monday, September 23, 2024

Deviyyani Sharma | చీరకట్టులో దేవయాని వ‌య్యారాలు..

నటిగా ఈ మధ్యకాలంలో అందరికి చేరువ అయిన ముద్దుగుమ్మ దేవియాని శర్మ. సైతాన్ వెబ్ సిరీస్ లో ఈమె చేసిన బోల్డ్ పెర్ఫార్మెన్స్ కి ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యారు. సేవ్ ది టైగెర్స్ వెబ్ సిరీస్ లో మోడ్రన్ ఐడియాలజీ ఉన్న భార్య క్యారెక్టర్ లో కూడా దేవయాని శర్మ అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. సైతాన్ లో మాస్ అండ్ బోల్డ్ క్యారెక్టర్ చేసిన దేవయాని సేవ్ ది టైగర్స్ సిరీస్ లో మోడ్రన్ టచ్ లో చూసేసరికి అందరూ షాక్ అయ్యారని చెప్పొచ్చు.

తరువాత ఈ బ్యూటీ అనగనగా అనే వెబ్ సిరీస్ తో కెరియర్ స్టార్ట్ చేసింది. తరువాత ఇన్ ది నేమ్ అఫ్ ది గాడ్ వెబ్ సిరీస్ లో నటించింది. ఆకాష్ పూరి రొమాంటిక్ మూవీలో కీలక పాత్రలో నటించింది. అలాగే నవీన్ చంద్ర భానుమతి రామకృష్ణ సినిమాలో కూడా దేవయాని నటించింది. అంజలి లీడ్ రోల్ చేసిన ఝాన్సీ వెబ్ సిరీస్ లో దేవియాని శర్మ చివరగా నటించింది.

ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోలని షేర్ చేస్తూ ఉంటుంది. ఈ ఫోటోలు వైరల్ అవుతాయి. తాజాగా మరో అదిరిపోయే అవుట్ ఫిట్ తో గ్లామరస్ ఫొటోలని ఇన్ స్టాగ్రామ్ లో దేవయాని శర్మ పంచుకుంది. ఈ లుక్స్ లో చాలా అందంగా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement