Wednesday, September 18, 2024

Devara | జాన్వీతో దేవ‌ర డ్యూయేట్…. ప్ర‌మో రిలీజ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న‌ చిత్రం ‘దేవర’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, ఫస్ట్ సింగిల్, టీజర్‌లకు మంచి స్పందన వచ్చింది. ఇక‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంలోని రెండో పాటను ఈ నెల 5న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ పాట ప్రోమోను విడుదల చేశారు మేకర్స్.

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement