ప్రపంచ వ్యాప్తంగా దేవర – పార్ట్ వన్ కలెక్షన్లు సునామీ సృష్టిస్తింది. తాజాగా ఈ సినిమా 509 కోట్ల క్లబ్ లో చేరింది. కొరటాల శివ డైరెక్షెన్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర”…. భారీ అంచనాలతో విడుదలైంది. అయితే, రిలీజ్ అనంతరం మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది.
అయితే అనుకున్న రేంజ్ హిట్ టాక్ తెచ్చుకోనప్పటికీ కూడా రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించింది. ఇక తారక్ సోలో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుటి వరకు 509 కోట్ల గ్రాస్ మార్కును దాటి చరిత్ర సృష్టించింది.
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించగా అనిరుధ్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఇక దేవర తర్వాత వార్ 2, ఎన్టీఆర్-నీల్ సినిమాలు చేయనున్నాడు. కాగా, దేవర 2 విడుదల సమయానికి ఓపెనింగ్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం.