Monday, September 16, 2024

Devara | దేవర మూడో సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

కొరటాల శివ దర్శకత్వంలో మాస్ మ్యాన్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలనేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్‌ను మేకర్స్ అందించారు. ఈ సినిమా నుంచి థర్డ్‌ సింగిల్‌ విడుదల తేదీని ప్రకటించారు.

ఈ మూవీ మూడో పాట దావుడి అనే పాటను సెప్టెంబర్ 4వ తేదీన (బుధవారం) విడుదల చేయనున్నట్లు వారు తెలిపారు. ఈసారి లిరికల్ వీడియోతో కాకుండా… ఎన్టీఆర్ అభిమానులు కోరుకునే డ్యాన్స్ మూమెంట్స్‌తో కూడిన వీడియో సాంగ్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

కాగా, ‘దేవర’ నుంచి ఇప్పటి వరకు రెండు పాటలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఫస్ట్ సాంగ్ ‘ఫియర్’ ఎన్టీఆర్ క్యారెక్టర్ తాలూకా హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా ఉంది. ఇక రెండో పాట ‘చుట్టమల్లె’ హీరో హీరోయిన్ల మీద తెరకెక్కించిన మెలోడీ. ఆ రెండూ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. మూడో పాట ‘డావుడి’ ఆ రెండిటినీ మించి ఉంటుందని సమాచారం. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement