Friday, October 18, 2024

Devara హిందీ థియేట్రికల్ రైట్స్ ఆ సంస్థకే

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘దేవర’. ఈ సినిమా రెండు భాగాలుగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుంది. ఇక ఈ పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తుంటే.. జాన్వీ కపూర్, శృతి మరాఠే హీరోయిన్లుగా కనిపించబోతున్నారు.

ఇదిలా ఉంటే, బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ కరణ్ జోహార్ ‘ధర్మ ప్రొడక్షన్స్’ దేవర నార్త్ బెల్ట్ థియేట్రికల్ హక్కులను పొందింది. గతంలో ఈ నిర్మాణ సంస్థ ‘బాహుబలి’, ‘ఘాజీ’ సినిమాలని నార్త్ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లి బ్లాక్ బస్టర్స్ అందుకుంది. కాగా దేవర సినిమా మొదటి భాగాన్ని దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement