Tuesday, October 22, 2024

Devara | ఆయుద పూజ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ !

కొర‌టాల శివ ద‌ర్శ‌త‌క్వంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రం “దేవర”. ఎన్నో అంచనాలు నడుమ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా తారక్ కెరీర్ లోనే సోలోగా బిగ్గెస్ట్ రికార్డులు కొల్లగొట్టి దుమ్ము లేపింది. కాగా, ఈ సినిమాలో… ఎన్టీఆర్ ఎంతో గ్రేస్‌ఫుల్‌గా డాన్స్ చేసిన ‘ఆయుద పూజ’ సాంగ్ మంచి క్రేజ్ సాధించింది.

సోషల్ మీడియాలో ఒక సెలబ్రేషన్ గా నిలిచిన ఈ సాంగ్ ని అఫీషియల్ గా టి సిరీస్ వారు ఫుల్ వీడియో సాంగ్ ని తెలుగులో విడుదల చేశారు. ఈ పాట వీడియోతో రిలీజ్ చేసిన కొన్ని క్షణాల్లోనే యూట్యూబ్లో మంచి వ్యూస్ సొంతం చేసుకుంది.

YouTube video

ఇదిలా ఉంటే సంగీత దర్శకుడు అనిరుధ్ అందించిన మ్యూజిక్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. సినిమాలో కేవలం నాలుగు పాటలే ఉన్నప్పటికీ ఒక్క ఛార్ట్ బస్టర్‌ను అందించాడు అనిరుధ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement