Friday, November 22, 2024

సినిమా రేటింగులు,రివ్యూల నిషేధం కోరుతూ కోర్టుకు వెళతాం – ‘మా ‘ ఏపీ వ్యవస్థాపకుడు దిలీప్ రాజా

తెనాలి, ప్రభా న్యూస్: వందలకోట్ల రూపాయలు పెట్టుబడితో విడుదల అవుతున్న సినిమాలపై విడుదల రోజునే సోషల్ మీడియాలో కొందరు రాస్తున్న స్వార్థపూరిత రేటింగులు,రివ్యూలను నిలువరించాలని కోరుతూ కోర్టుకు వెళ్ళనట్లు మా ఏపీ వ్యవస్థాపకుడు ,సినీ దర్శకుడు ధోనిపూడి దిలీప్ రాజా అన్నారు. రేటింగులు ,రివ్యూల ప్రభావం కలెక్షన్స్ పైన పడుతున్న నేపథ్యంలో బాధ్యులపై చట్టపరిధిలో తగుచర్యలు తీసుకోవాలని న్యాయస్థాానికి మొరపెట్టు కుంటున్నట్లుగా’ తెలిపారు. వీటి నిషేదం అంశంపై హైకోర్టు నాయవాదులతో ఇప్పటికే చర్చిoచామని ఆయన వివరించారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ‘ మా – ఏపి’ 24 విభాగాల కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొన్ని స్వార్థపూరిత రేటింగ్ లు,రివ్యూలవలన వందలకొట్లతో నిర్మించిన సినిమాల కలెక్షన్లు మందగించి ఆయా నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక చిన్న సినిమాలకు దేవుడే దిక్కు అన్నారు. సినిమాలకు నిజమైన రేటింగును టాకీ సినిమాల నుండి ప్రేక్షకులే ఇచ్చుకుంటూ వచ్చారని ఆయన గుర్తు చేశారు.సినిమా బాగుంటే చూస్తారు,బోగొ లేకపోతే ప్రేక్షకులే తిప్పికొట్టాలని ఆయన వ్యాఖ్యానించారు.అదే ప్రేక్షకుల ఇచ్చిన నిజమైన రేటింగ్ అన్నారు. ఒకరిదృష్టిలో బాగున్న సినిమాలోని కంటెంట్ మరొకరి దృష్టిలో బాగుండకపోవచ్చు, మనుషులందరి మనస్తత్వాలు ఒకటిగా లేనపుడు వారి వ్యక్తిగత అభిప్రాయం సోషల్ మీడియాలో అందరిపైనా రుద్దటం సహేతుకం కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ రేటింగులు ఇచ్చే వారి రాతలవలన నిర్మాతల బతుకురాతలు మారిపోతున్నాయని దిలీప్ రాజా ఆందోళన వ్యక్తం చేశారు

.ఇప్పటికే సోషల్ మీడియాపై కత్తెరపెట్టెలా పార్లమెంటులో బిల్లు పెట్టవలసినదిగా కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార శాఖ మంత్రిని కోరామని ఆయన పేర్కొన్నారు.నిర్మాతల జీవితాలను దుర్భరం చేసేలా రేటింగులు రివ్యూలు పెట్టవద్దని ఆయన యూట్యూబ్ నిర్వాహకులను అలాగే సోషల్ మీడియా ప్రతినిధులకు దిలీప్ రాజా హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement