Monday, September 9, 2024

Devara | సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్..

కొరటాల శివ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘దేవర’. ఈ ప్రెస్టీజియస్ మూవీకి సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ సాంగ్, టీజర్ లకు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే, తాజాగా ఈ చిత్రంలోని రెండో సింగిల్ సాంగ్ పై క్లారిటీ ఇచ్చారు మేక‌ర్స్. ఈ మూవీ సెకండ్ సింగిల్ ను ఆగస్టు 5న విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.

ఇక బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement