నటి పవిత్రగౌడకు అసభ్య సందేశాలు పంపినందుకు రేణుకాస్వామి అనే యువకుడిని హత్య చేశారనే ఆరోపణలపై కన్నడ చలనచిత్ర నటుడు దర్శన్ తూగుదీప అరెస్ట అయ్యాడు. కన్నడనాట సంచలనం సృష్టిస్తోంది కేసులో తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. మంగళవారం దర్శన్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
బెంగళూరులోని దర్శన్ ఫామ్‌హౌస్‌లో ఈ ఘటన మృతదేహంతో పాటు ఒక సూసైడ్‌నోట్, ఒక వీడియో సందేశాన్ని గుర్తించారు పోలీసులు. ఒంటరితనం వల్లే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆ లేఖలో, వీడియోలో శ్రీధర్ పేర్కొన్నారు. తన చావుకు ఎవరూ కారణం కాదని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.