Monday, November 25, 2024

‘దంగల్’ నటి సుహాని భట్నాగర్ హఠాన్మరణం..

బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. అమీర్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ దంగల్ లో బాలనటిగా నటించిన సుహాని భట్నాగర్ కన్నుమూశారు. ఆ సినిమాలో బబితా ఫోగట్‌గా నటించిన సుహాని 19 ఏళ్ల వయసులో మరణించడం ఇండస్ట్రీలో అందరినీ కలిచివేసింది. దంగల్‌లో ఆకట్టుకునే నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కొన్నాళ్ల క్రితం సుహానీకి పెద్ద ప్రమాదం జరిగి కాలికి గాయమైంది. చికిత్స సమయంలో తీసుకున్న కొన్ని మందులు సుహానిపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఆమె శరీరంలో మెల్లగా ద్రవం చేరడంతో.. ఇటీవల ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు. కానీ చికిత్స చేసినా ప్రయోజనం లేకపోయింది. ఈరోజు ఆమె పరిస్థితి విషమించి ఆకస్మికంగా మృతి చెందింది. ఈ విషయాన్ని సుహాని కుటుంబ సభ్యులు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. కాగా, సుహాని మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రేక్షకులు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement