- పాట పాడి అభిమానులను ఉర్రూతలూగించిన బాలయ్య
- కేరింతలతో ఊగిపోయిన అభిమానులు
- ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ పై బాలయ్య పంచ్
- తనవి అన్ని ఒరిజినల్ కలెక్షన్స్ అంటూ విసుర్లు
నందమూరి బాలకృష్ణ, బాబీ కొల్లి కాంబినేషన్‌లో సంక్రాంతి సందర్భంగా విడుదలైన డాకు మహారాజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. చిత్రంలోని పాటలు ప్రేక్షకులు, అభిమానులను ఉర్రూతలూగించాయి. చిత్రం బ్లాక్ బస్టర్ విజయంతో చిత్ర బృందం వరుసగా విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది.
తాజాగా అనంతపురంలో జరిగిన సక్సెస్ మీట్‌లో నందమూరి బాలకృష్ణ మరోసారి సింగర్‌గా మారిపోయారు. బాలకృష్ణ చిత్రంలోని పాట పాడి అభిమానులను ఉర్రూతలూగించారు. బాలయ్య పాట పాడటంతో అభిమానులు కేరింతలు కొడుతూ సందడి చేశారు.
ఈ ఈవెంట్ లో బాలయ్య ఎనర్జిటిక్ స్పీచ్ ఫ్యాన్స్ ని మరింత ఉత్సాహ పరచింది. డాకు మహారాజ్ మొదలైన నాటి నుంచి రిలీజ్ వరకు తనతో పాటు సినిమాకు కాంట్రిబ్యూట్ చేసిన ప్రతి ఒక్కరి గురించి ప్రస్తావించారు బాలయ్య. ఇక ఇదే క్రమంలో రికార్డుల గురించి బాలకృష్ణ పంచ్ వేశారు.
నావి అన్ని ఒరిజినల్ రికార్డులని చెప్పారు బాలయ్య. అంటే ఈమధ్య పోస్టర్స్ పై ఫేక్ కలెక్షన్ నెంబర్స్ అనేవి చాలా కామన్ అయ్యాయి. సినిమాకు ఎలాంటి టాక్ వచ్చినా సరే వాటికి సంబంధం లేకుండా కలెక్షన్స్ పోస్టర్స్ వేస్తున్నారు. వీటిపై నిర్మాతలు అదంతా పబ్లిసిటీ స్టంట్ అని చెబుతున్నా కూడా ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసేందుకు అలా చేస్తున్నారు.
సినిమాలో నటించిన శ్రద్ధ, ప్రగ్యా గురించి కూడా మాట్లాడారు బాలకృష్ణ. ఇద్దరు బాగా చేశారని. ఊర్వశి కూడా తన డ్యాన్స్ తో మెప్పించిందని అన్నారు. యానిమల్ కన్నా ముందే బాబీ డియోల్ ని తీసుకున్నామని.. సినిమా నేపథ్యానికి అతను బాగా సూట్ అయ్యాడని అన్నారు బాలయ్య.
తన అభిమానులను ఉద్దేశించి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారు మళ్లీ క్షేమంతా ఇంటికి వెళ్లాలని సూచించారు బాలయ్య. తన ఫ్యాన్స్ తన కను సైగ చేస్తే అర్ధం చేసుకుంటారని అన్నారు.