బాబీ దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “డాకు మహారాజ్”. ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాధ్‌లు కథానాయికలు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్నఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఆల్రెడీ ఓ ట్రైలర్ వచ్చి అలరించిన సంగతి తెలిసిందే. అయితే నిన్న ఏపీలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయగా… అది అనూహ్యంగా క్యాన్సిల్ అయింది. దీంతో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు చిత్రబృందం తాజాగా రెండో ట్రైలర్‌ను విడుదల చేసింది.
కాగా, నిన్న ఏపీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో అభిమానుల మరో ఈవెంట్ ను మేకర్స్ ప్లాన్ చేశారు. హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ హోటల్ లో ఈ సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.