Wednesday, November 20, 2024

అరణ్య ఆకట్టుకోలేకపోయాడా ? రివ్యూ

దగ్గుబాటి రానా… అతితక్కువ కాలంలోనే నటుడిగా మంచి పేరును తెచ్చుకున్నాడు. తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. బాహుబలి లాంటి సినిమాల్లో నటించి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. అయితే ప్రస్తుతం రానా అరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రభు సోలొమన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విషయానికి వస్తే కార్పోరేట్ సంస్థలకు చెందిన వ్యక్తులు అడ‌వుల‌పై కన్నేసి , స‌హాజ సంప‌ద‌ను దోచుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తుంటే వారిని రానా అడ్డుకుంటాడు. రాష్ట్రప‌తి అవార్డు పొందిన ఫారెస్ట్ మెన్ గా రానా ఈ సినిమాలో క‌నిపిస్తారు. మొక్క‌ల‌తో స్నేహం చేయ‌టం, అడ‌వికే అంకితం అవ‌డంతో రానాను అర‌ణ్య అని పిలుస్తుంటారు. అయితే ఆ అడ‌విపై కేంద్ర‌మంత్రి క‌న్నేయ‌టం… అడ‌వుల్లో ఏనుగుల్ని పంపించేందుకు నీరు దొర‌క్కుండా గోడలు క‌ట్టేయ‌టంతో అర‌ణ్య అతని నుంచి ఎలా అడవిని ఏనుగులను కాపాడుతాడో చెప్పేదే ఈ కథ.

ఏనుగులు అడ‌వుల‌కు ఎలా మేలు చేస్తాయి… అడ‌వులతో మ‌న‌కు ఎలాంటి లాభాలు ఉంటాయనేది స్పష్టంగా ఈ సినిమాలో చూడొచ్చు. ఇక అదే విధంగా రానాను ఎలివేట్ చేసిన తీరు, మ‌రోవైపు సినిమాను ఇంట్రెస్టింగ్ మార్చేందుకు వ‌చ్చే స‌న్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే, ఫస్టాఫ్ లో వ‌చ్చిన న‌క్సలైట్ పాత్ర‌లు ఉన్నట్టు ఉండి కనిపించకుండా పోవటం…. తరువాత వచ్చే స‌న్నివేషాలు ముందుగానే ప్రేక్షకుడు అంచ‌నా వేసే విధంగా ఉంటాయి. అయితే, అర‌ణ్య‌-ఏనుగుల మ‌ధ్య సీన్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయనే చెప్పాలి. నటన పరంగా రానా అర‌ణ్య‌గా జీవించాడనేచెప్పాలి. మరోవైపు జోయా, విష్ణు విశాల్ ల‌వ్ ట్రాక్ తో పాటు అనంత్ మ‌హ‌దేవ‌న్, ర‌ఘుబాబు న‌ట‌న కూడా ఆకట్టుకుంటుంది. మొత్తంగా చెప్పాలంటే అరణ్య అంతగా జనాలను ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement