బాబీ దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘డాకు మహారాజ్’. ఈ సినిమాలోని ఇప్పటికే విడుదలైన రెండు పాటలు అభిమానులను ఆకట్టుకోగా, తాజాగా మూడో పాటను రిలీజ్ చేశారు మేకర్స్.
‘దబిడి దీబిడి’ అనే డ్యాన్స్ నెంబర్ లిరికల్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ సినిమాకి తమన్ సంగీతం అందించగా… డాకు మహారాజ్ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.