తమిళ స్టార్ డైరెక్టర్ కె.వి.ఆనంద్ గుండె పోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే కె.వి.ఆనంద్ మృతి పట్ల మరో సంచలన వార్త బయటకు వచ్చింది. ఆయన మృతికి గుండె పోటుతో పాటు కరోనా ప్రభావం కూడా కారణమని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే వారి కుటుంబీకులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని… దానితో ఆయన కూడా పాజిటివ్ రావడంతో శ్వాస ఇబ్బందులు వచ్చి హాస్పటల్ లో జాయిన్ అయ్యారని తెలుస్తోంది.
ఆ తర్వాత గుండెపోటు వచ్చి మరణించారని తెలిసింది. ఇక ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని బయటకు పంపడం కుదరదని హాస్పిటల్ యాజమాన్యం ప్రకటించింది. కరోనా ప్రోటోకాల్ ప్రకారం ఆయన మృత దేహానికి అంత్యక్రియలు నగర్ ఎలక్ట్రికల్ అంత్యక్రియ శాలకు పంపబడుతుందని తెలిపారు. మొదట హీరో సూర్య మృతదేహాన్ని బయటికి ఇవ్వాలని అభ్యర్థించిన సంగతి తెలిసిందే.