Wednesday, November 20, 2024

చిరంజీవి అల్లుడికి కరోనా

మరో మెగా హీరో కరోనా బారినపడ్డారు. మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా కళ్యాణ్ ప్రకటించారు. బుధవారం కరోనా టెస్ట్ చేయించుకోగా అందులో పాజిటివ్ నిర్ధారణ కావడంతో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నానని… ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నానని కళ్యాణ్ దేవ్ తెలిపారు.

త్వరలో మరింత స్ట్రాంగ్ గా తిరిగి వస్తానని మీ ప్రేమకు అభిమానానికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ ని పెట్టారు. ఇక సినిమాల విషయానికొస్తే విజేత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. ప్రస్తుతం సూయర్ మచ్చి సినిమాతో పాటు మరో సినిమా లో నటిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement