Friday, November 22, 2024

అమీర్ ఖాన్ కు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి దేశంలో సెకండ్ వేవ్ లో భాగంగా విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతుంది. ప్రతి రోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన టీం ప్రకటించారు. తనకు ఎలాంటి లక్షణాలు లేకుండా కరోనా వైరస్ నిర్ధారణ అయిందని.. ప్రస్తుతం హోమ్ కోరం టైం లో ఉన్నట్లు తెలిపారు.

ఇక తన స్టాఫ్ అంతా కూడా టెస్ట్ చేయించుకోవాలని ఆయన కోరారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ప్రస్తుతం చేస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమాలు షూటింగ్ లో పాల్గొంటానని ఆయన తెలిపారు. అయితే ఇటీవల సోషల్ మీడియా కు గుడ్ బై చెప్పిన ఆయన తన టీం ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement