నటుడు ఆశిష్ విద్యార్థికి సినీ ప్రేక్షకులకు సుపరిచితుడే. తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలో కూడా అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా ఆశిష్ విద్యార్థి ఇప్పుడు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలిపారు. స్వల్పంగా జ్వరం ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని.. అందులో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు. అన్ని విషయాలలో నేను పాజిటివ్ గా ఉంటాను. కానీ ఈ విషయంలో పాజిటివ్ గా ఉండకూడదు అని అనుకున్నా, కానీ ఇంకోలా అయింది అంటూ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం చికిత్స కోసం ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేరుతున్నానని అలాగే ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.