Friday, November 22, 2024

Rakshit Shetty | ర‌క్షిత్‌ శెట్టిపై కాపీరైట్ కేసు..

క‌న్న‌డ న‌టుడు, నిర్మాత ర‌క్షిత్‌ శెట్టి పై కేసు న‌మోదైంది. యశ్వంతపుర పోలీస్ స్టేషన్‌లో MRT మ్యూజిక్ కంపెనీ రక్షిత్ శెట్టిపై కాపీరైట్ కేసు నమోదు చేసింది. తమ సంస్థకు చెందిన పాటలను కాపీ కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘న్యాయ ఎల్లిదే’, ‘గాలిమాతు’ సినిమాల్లోని పాటలను… ప‌రంవా స్టూడియోస్ ప‌తాకంపై ర‌క్షిత్ శెట్టి నిర్మించిన‌ ‘బ్యాచిలర్ పార్టీ’ సినిమాలో కాపీ కొట్టారని తెలిపింది. కాగా, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఫిర్యాదుపై స్పందించాల్సిందిగా నటుడికి పోలీసులు నోటీసులు పంపారు. ఈ ఆరోపణపై రక్షిత్ శెట్టి లేదా అతని బృందం ఇప్పటి వరకు స్పందించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement