Friday, September 20, 2024

Coolie | రజినీ సినిమాలో నాగార్జున..

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ లేటెస్ట్ అప్ క‌మింగ్ మూవీ కూలీ. రజినీకాంత్ 171వ సినిమాగా తెర‌కెక్కుతున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇక‌, ఇప్పటికే ఈ సినిమా నుంచి చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసారు. అయితే, నేడు కింగ్ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలో నాగార్జున నటించబోతున్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు మేక‌ర్స్.

కూలీ సినిమాలో నాగార్జున ‘సైమన్’ అనే పాత్ర చేయబోతున్నాడు. నాగార్జునకు బర్త్ డే విషెష్ చెప్తూ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఈ మూవీని తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement