Monday, November 18, 2024

సైకో వర్మ టైటిల్ పై వివాదం

సెన్సార్ బోర్డు వారి పై మండిపడ్డారు నిర్మాత నట్టికుమార్. బోర్డ్ తీర్పు పై కోర్టుకు వెళ్లాలనే ఆలోచనలో కూడా ఉన్నామని నట్టికుమార్ అన్నారు. అసలు విషయం ఏంటంటే…. నట్టి కుమార్ కొడుకు నట్టి క్రాంతి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సైకో వర్మ. అయితే ఈ సినిమా టైటిల్ ను మార్చమని… సెన్సార్ అధికారులు చెబుతున్నారని, సైకో అన్న పదాన్ని తొలగించాలని లేకుంటే టైటిల్ మార్చాలని వారు చెప్పినట్లు నట్టికుమార్ తెలిపారు.

కాగా గతంలో సైకో పేరుతో ఎన్నో చిత్రాల టైటిల్స్ వచ్చాయని…వాటిపై లేని అభ్యంతరం తమ చిత్రం టైటిల్ కు ఎందుకు పెడుతున్నారు అని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement