Friday, November 22, 2024

మాకు కావాల్సింది ఈ వినోదం కాదు…. అనసూయ హాట్ పిక్స్ పై నెటిజన్ ట్వీట్

జబర్దస్త్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో కొత్తగా చెప్పనవసరం లేదు. హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ నెటిజన్ల హృదయాలను కొల్లగొడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఆ ఫోటోలపై కొంతమంది అసభ్యకర కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. ఇలానే చాలాసార్లు జరిగింది కూడా. తాజాగా మరోసారి అనసూయ కు అలాంటి పరిస్థితి ఎదురైంది. .

ఇటీవల జరిగిన ఫోటో షూట్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను అనసూయ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అంతేకాకుండా నేను ఇంకా చిన్నపిల్లనే అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక అది చూసిన నెటిజన్లు అనసూయపై సెటైర్లు వేయడం స్టార్ట్ చేశారు.

ఒక వైపు కరోనా అల్లకల్లోలం చేస్తుంటే ఈ పరిస్థితుల్లో మీరు ఇలాంటి ఫోటోలు పెట్టడం అవసరమా అంటూ కామెంట్ చేశాడు ఓ వ్యక్తి. ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేసే ముందు దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు మరణాల గురించి మీకు ఎలాంటి బాధ లేదా… ఇలాంటి పరిస్థితుల్లో అవసరమా అంటూ ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ఇక అనసూయ కూడా ఆ కామెంట్ కు దీటుగానే సమాధానమిచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీకు కొంత వినోదాన్ని పంచాలనే మా ప్రయత్నం. అదే నా ఉద్దేశ్యం అంటూ రిప్లై ఇచ్చింది. వెంటనే ఆ యువకుడు మరో కౌంటర్ వేసాడు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు కావాల్సింది మీరిచ్చే వినోదం కాదు.. దాని ద్వారా వచ్చే నమ్మకం కాదు..వాళ్లకి మద్దతు కావాలి అంటూ అతను చెప్పుకొచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement