భారీ చిత్రాలకోసం భారీ వ్యయంతో సెట్స్ వేయడం మళ్లి ప్రారంభమైంది. నిర్మాణంలో ఉన్న అనేక చిత్రాల కోసం ఆర్ట్ డైరెక్టర్లు సెట్స్ వేసే పనిలో బిజీగా ఉన్నారు. స్టార్స్‌తో చిత్ర నిర్మాణం చేస్తున్నపుడు ఔట్‌డోర్‌లో తీయడం కొంత ఇబ్బంది. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. షూటింగ్ కూడా వేగంగా జరగదు. అందకే సెట్స్ వేయడానికి దర్శక, నిర్మాతలు మొగ్గుచూపుతున్నారు. రంగస్థలం కోసం గ్రామాన్నే సృష్టించారు. ఆచార్య కోసం ధర్మస్థలి సెట్ వేశారు. సర్కారువారి పాట కోసం బ్యాంక్‌ను సృష్టించారు. అయితే ఈ జాబితాలో రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా చేరింది. స్టూవర్టుపురం దొంగ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందుకోసం స్టూవర్టుపురం గ్రామాన్ని సెట్ వేస్తున్నారు. సుమారు ఏడు కోట్ల ఖర్చుతో ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల ఆధ్వర్యంలో సెట్ నిర్మాణం జరుగుతున్నట్టు తెలిసింది. శంషాబాద్ సమీపంలో ఐదు ఎకరాల స్థలంలో ఈ నిర్మాణ జరుగుతోంది. ఈ చిత్రానికి వంశీ దర్శకుడు. త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..