హ్యాపీడేస్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు వరుణ్ సందేశ్. ఆ తర్వాత కొత్త బంగారులోకం సినిమా తో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. వరుస ఫ్లాప్ లు వచ్చాయి. ఇక ప్రస్తుతం వరుణ్ సందేశ్ ఇందువదన సినిమా చేస్తున్నాడు. కాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… మీరు కూడా ఉదయ్ కిరణ్, తరుణ్ లా కెరీర్ స్టార్టింగ్ లో సక్సెస్ అయ్యి తరువాత ఫెయిల్ అవుతున్నారు అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ… వారిద్దరితో నన్ను పోల్చవద్దని అన్నారు.
ఉదయ్ కిరణ్ నాకు బాగా తెలుసు అని ఆయన వ్యక్తిగత జీవితంలో ఏం జరిగిందో తెలిసి చాలా బాధపడ్డాను అని చెప్పుకొచ్చారు. అలాగే తరుణ్ కూడా తెలుసని నా చేతుల్లో నుంచి కోల్పోయిన దానిని తెచ్చుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాను అని తెలిపాడు వరుణ్.