అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో తెలుగు-తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం కస్టడీ. కృతి శెట్టి కథానాయిక. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇదే నెల 12న కస్టడీ థియేటర్లలో రానున్న సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది.
నాగచైతన్య మాట్లాడుతూ టీ-జర్ కి తెలుగు, తమిళ్ ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. -టైలర్ మే 5న విడుదలౌతుంది. ఒక మామూలు కానిస్టేబుల్ చేతికి నిజం అనే ఆయుధం చేతిలో వుంటే తను ఎంత దూరం వెళ్తాడనే అంశం గురించి వెంకట్ ప్రభు గారు చెప్పినప్పుడు చాలా నచ్చింది. ఈ కథకు నేను ఎందుకు అని అడిగినపుడు.. లవ్ స్టొరీలో నా నటన నచ్చిందని, ఈ పాత్రకు నేను సరిగ్గా సరిపోతానని చెప్పారు. అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్ గారితో పని చేయడం గొప్ప అనుభవం. ఇళయరాజా, యువన్ శంకర్ రాజాలతో పని చేయడం నా కల నెరవేరినట్లయింది. అన్నారు.
కృతి శెట్టి మాట్లాడుతూ ఈ కథని వెంకట్ ప్రభు గారు చాలా సింపుల్ గా చెప్పారు. హీరో విలన్ ని కాపాడతాడని అన్నారు. మొదట షాక్ అయ్యా. అంతే స్క్రీన్‌ప్లే ఇంత సింపుల్ గా ఉండదు. చాలా ఇం-టె-ల్‌జెంట్ స్క్రీన్‌ప్లే. అని పేర్కొన్నారు.
వెంకట్ ప్రభు మాట్లాడుతూ నా మొదటి తెలుగు సినిమా నాగచైతన్య తో చేయడం ఆనందంగా వుంది. ఇది నా కెరీర్ లో భారీ చిత్రం. నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ కథ నాగచైతన్య చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇది పూర్తిగా యాక్షన్ మూవీ. ప్రతి కథలో హీరో విలన్ ని చంపాలనుకుంటాడు. కానీ ఇందులో విలన్‌ని కాపాడటం హీరో కాపాడుతాడు. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో ఒకే సమయంలో చిత్రీకరించాం. అన్నారు. ఈ సమావేశంలో నిర్మాత శ్రీనివాస చిట్టూరి, చిత్ర సమర్పకులు పవన్ పాల్గొన్నారు