Thursday, November 21, 2024

సినిమా vs క్రికెట్.. సమ్మర్ మూవీస్‌కి ఐపీఎల్ గండం..

దేశంలో క్రికెట్, సినిమాలు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కి కేర్ ఆఫ్ అడ్రస్ అనే చెప్పాలి. ఇప్పడు సమ్మర్ సీజన్ కూడా స్టార్ట్ అయ్యింది. థియేటర్లలో సమ్మర్ సినిమాలు సందడి చేసే సమయం ఇది. లేటెస్ట్ గా నేచురల్ స్టార్ నాని సినిమా ‘దసరా’ బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా ప్రారంభమైంది. ఇక వచ్చే శుక్రవారం నుండి, ప్రతి వారం కనీసం రెండు, మూడు సినిమాలు రిలీజ్ కాబోతున్న‌ట్టు తెలుస్తోంది. కాగా, రావణాసుర, శాకుంతలం, విరూపాక్ష, ఏజెంట్, కస్టడీ, పొన్నియిన్ సెల్వన్-2, హనుమాన్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ వంటి మంచి బజ్ ఉన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రేడీగా ఉన్నాయి. ఇవే కాకుండా మరిన్ని చిన్న బడ్జెట్ సినిమాలు కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.

అయితే, ఈ సినిమాలన్నీ ఈ ఏడాది కొన‌సాగుతున్న‌ 16వ ఎడిషన్ టాటా IPL క్రేజ్‌ని తట్టుకోగలవా? అనే ప్రశ్న చాలామంది నుంచి వినిపిస్తోంది. ఎందుకంటే నిన్న (శుక్రవారం) గుజరాత్ టైటాన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఓపెనింగ్ మ్యాచ్ జియో సినిమా యాప్ లో ఘనమైన వ్యూయర్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో ఐపిఎల్ కి ఉన్న క్రేజ్‌ను అర్థంచేసుకోవచ్చు.

మ‌రి.. భారతీయ చిత్ర పరిశ్రమకు ఇది కాస్త ఆందోళన కలిగించే అంశమే అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా, ఈ ఐపిఎల్ సీజన్ మే 28 వరకు కొనసాగుతుంది. ఇప్పుడు ఈ సినిమాల ఫేట్‌ను నిర్ణయించేది రిలీజ్ అయ్యే సినిమాల కంటెంట్ మీదే అధారపడి ఉంటుంది. చూద్దాం ఎవరిది పైచేయి అవుతుందో.

Advertisement

తాజా వార్తలు

Advertisement