సినీ కార్మికులకు సీసీసీ ఫండ్ ద్వారా కోవిడ్ టీకా అందజేంసేందుకు ప్రయత్రిస్తామని చిరంజీవి అన్నారు. వైల్డ్‌డాగ్ మూవీ విశేషాలను మీడియాతో పంచుకున్నారు నాగార్జున, చిరంజీవి. ఈ సందర్భంగా చిరు కార్మికులకు టీకా అందించడంపై ప్రస్తావించారు. ప్రస్థుతం సీసీసీలో కొంత మొత్తం మిగిలి ఉందన్న ఆయన. ఆ మొత్తంతో సినీ కార్మికులకు కోవిడ్ టీకా అందిస్తే బాగుంటుందనుకుంటున్నామన్నారు. కరోనా టైంలో కార్మికుల కుటుంబాలకు వ్యాక్సిన్ ఇస్తే..వారికి ఆరోగ్యాన్నిచ్చిన వాళ్లమవుతామని చిరంజీవి అన్నారు.
ఇక వైల్డ్ డాగ్ మూవీ గురించా మాట్లాడుతూ..ఓ గెస్ట్ ప్రెస్ మీట్ పెట్టండి. ఈ సినిమా గురించి అందరికీ చెప్పాలనడం మొదటిసారేమో అని అన్నారు చిరు. సినిమాలో ప్రతీ సన్నివేశం ఉత్కంఠను కలిగించిందని, వైల్డ్ డాగ్ చిత్రాన్ని ప్రతీ ఒక్కరు చూడాలని చిరంజీవి సూచించారు. వైల్డ్‌డాగ్ చిత్రాన్ని అద్బుతంగా తీసిన డైరెక్టర్ అహిషోర్ సోలోమన్ తోపాటు నిర్మాత నిరంజన్ రెడ్డిని ప్రశంసించారు. తెలుగు చిత్రపరిశ్రమలో వైల్డ్ డాగ్ లాంటి సినిమాలు మరిన్ని రావాలని చిరంజీవి ఆకాంక్షించారు.