Monday, October 21, 2024

ప్రతిజిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్… మెగాస్టార్

కరుణ సెకండ్ వేవ్ లో చాలామంది ఆక్సిజన్ లేక మృతి చెందుతున్నారు. అధికారికంగా గా దేశంలో వేల మంది చనిపోతుంటే… అనధికారికంగా ఇంకా మరెంతో మంది చనిపోతున్నారు. అయితే ఆక్సిడెంట్ సమస్యను తీర్చేందుకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారని కానీ టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి నాగార్జున వంటి వారు పట్టించుకోవడం లేదని సినీ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇదే విషయంపై స్పందించి… ఆక్సిజన్ అందక ప్రాణాలు పోవడం బాధ కలిగించిందని…రక్తం దొరక్క ఏ ఒక్కరూ ప్రాణాలు పోకూడదని 1998 లో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేశానని ఇప్పుడు ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే వారం రోజుల్లోనే ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని శరవేగంగా పనులు సాగుతున్నట్లు చిరంజీవి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement