Tuesday, November 19, 2024

పిల్ల‌ల‌కి త‌ల్లి..తండ్రి ఇద్ద‌రి ప్రేమ అవ‌స‌రం.. క‌ళ్యాణ్ దేవ్

న‌టుడు..మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమారై భ‌ర్త కళ్యాణ్ దేవ్ ఒక వీడియో షేర్ చేశారు. సదరు వీడియోలో ఓ పాప స్కూల్ కల్చరల్స్ లో పాల్గొంటుంది. వేదిక ముందున్న పేరెంట్స్ ని చూసి ఆమె చాలా ఎగ్జైట్మెంట్ ఫీలవుతుంది. ఈ వీడియోను కళ్యాణ్ దేవ్ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టారు. ఆ వీడియోకి ఓ కామెంట్ కూడా పెట్టారు. పిల్లలకు తల్లి, తండ్రి ఇద్దరి ప్రేమ కావాలి. నవిష్క, నివ్రితిలను బాగా మిస్ అవుతున్నానని కళ్యాణ్ దేవ్ కామెంట్ పెట్టాడు. నవిష్క తో పాటు నివ్రితిని కూడా తలుచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నవిష్క శ్రీజ-కళ్యాణ్ దేవ్ లకు పుట్టిన అమ్మాయి. నివ్రితి మాత్రం శ్రీజ మొదటి భర్త సంతానం. శ్రీజను వివాహం చేసుకున్నాక నివ్రితిని కూడా కళ్యాణ్ దేవ్ కూతురిగా భావించారు. ఆమెతో అనుబంధం పెంచుకున్నాడు. శ్రీజతో మనస్పర్థలు వచ్చిన నేపథ్యంలో ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. నవిష్క, నివ్రితి శ్రీజ వద్దే పెరుగుతున్నారు. దీంతో వారిని కలిసే అవకాశం కళ్యాణ్ దేవ్ కి లేకుండా పోయింది. ఈ కారణంగా కూతుళ్లను తలచుకుని కళ్యాణ్ దేవ్ ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement