Monday, November 25, 2024

NCPCR | నెట్‌ఫ్లిక్స్‌కు బాలల హక్కుల కమిషన్ నోటీసులు..

ప్ర‌ముక స్ట్రీమిండ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌కు బాలల హక్కుల సంఘం నోటీసులు ​జారీ చేసింది. మైనర్‌లకు “లైంగిక అసభ్యకరమైన కంటెంట్” అందుబాటులో ఉంచిందన్న ఆరోపణలపై ఈ సమన్లు జారీ చేసింది.

నెట్‌ఫ్లిక్స్ మంగళవారం బాలల హక్కుల కమిషన్ అధికారులకు రాసిన లేఖలో, మైనర్‌లకు అసభ్యకరమైన లైంగిక కంటెంట్‌ను అందుబాటులో ఉంచడం “లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం-2012” పరిధిలోకి వస్తుందని పేర్కొంది. అయితే ఈ విషయంపై నెట్‌ఫ్లిక్స్ ఇంకా స్పందించలేదు.

ఇదే అంశంపై తాము గతంలోనూ నెట్‌ఫ్లిక్స్‌కు లేఖ రాశామని, అయితే ఎలాంటి స్పందన రాలేదని బాలల హక్కుల సంఘం వెల్లడించింది. దీనికి సంబంధించి, తీసుకున్న చర్యల వివరాలతో జూలై 29 మధ్యాహ్నం 03 గంటలలోపు తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని లేఖలో నెట్‌ఫ్లిక్స్‌ను ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement