Tuesday, November 19, 2024

Celebrations – సాయి పల్లవి ఇంట పెళ్లి సందడి – లవ్ మ్యారేజ్ చేసుకుంటున్న సోదరి

హీరోయిన్ సాయి పల్లవి ఇంట పెళ్లి సందడి మొదలైంది.. సాయి పల్లవి చెల్లి పెళ్లి చేసుకోబోతుంది.. ఆమె ఒక యాక్టర్ అని ఎవరికి తెలియదు.. నిజానికి ఆమె కూడా ఒక యాక్టర్ .ఒక్కటంటే ఒక్క మూవీ చేసింది. ఇప్పుడు ఏకంగా పెళ్లికి రెడీ అయిపోయింది. బాయ్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసేసరికి ఈ విషయం వెలుగులోకి వచ్చింది.. ఈ విషయం పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి.. అక్క ఉండగా.. చెల్లికి పెళ్లేంటి? అనే సందేహాలు కూడా వస్తున్నాయి.

.ఇక సాయి పల్లవి ఎంత పెద్ద స్టారో అందరికీ తెలుసు.. మలయాళ ‘ప్రేమమ్’ మూవీతో హీరోయిన్ అయిన ఈ బ్యూటీ.. ‘ఫిదా’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘పడిపడి లేచే మనసు’, ‘లవ్ స్టోరీ’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘విరాటపర్వం’ లాంటి సినిమాలతో అద్భుతమైన నటిగా గుర్తింపు తెచ్చుకుంది.. ఒకవైపు డాక్టర్ చదువు చదువుతూనే మరోవైపు వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తుంది.

ఇకపోతే సాయిపల్లవి చెల్లి పూజకన్నన్ స్వతహాగా సోషల్ వర్కర్. కాకపోతే తమిళంలో ‘చిత్తరాయి సెవ్వనం’ అనే సినిమాలో లీడ్ రోల్ చేసింది. దీని తర్వాత మరి ఛాన్సులు రాలేదో ఏమో గానీ పూర్తిగా వ్యక్తిగత జీవితానికే పరిమితమైపోయింది. ఇప్పుడు ఆమె తన ప్రియుడిని పరిచయం చేసింది.. ఇక ఇంట్లో ఒప్పుకున్నట్లు కూడా తెలిపింది.. మొత్తానికి ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోబోతుంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement