దళితులపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కోలీవుడ్ నటి నటి మీరా మిథున్‌పై చెన్నై నగర పోలీసులు చార్జిషీటును దాఖలు చేశారు. చార్జిషీట్ సినీస్థానిక ఎగ్మోర్ కోర్టులో సమర్పించారు. మీరా మిథున్‌పై వీసీకే నేత ఇచ్చిన ఫిర్యాదుతో మైలాపూర్ పోలీసులు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. ఆ తర్వాత కేరళ రాష్ట్రంలో దాగివున్న మీరా మిథున్ ను స్పెషల్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్ కోరుతూ ఆమె దాఖలు చేసుకున్న పిటిషన్లను కూడా కోర్టు కొట్టివేసిన విషయం తెల్సిందే. తమిళ చిత్రసీమ లో ఉన్న దళిత సామాజిక వర్గానికి చెందిన దర్శకులను తరిమికొట్టాలంటూ ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలోనే మీరా మిథున్ పై కేసు నమోదైంది.
ఇది కూడా చదవండి:ఈటల రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి: బాల్క సుమన్