Wednesday, January 8, 2025

Ajit | దుబాయ్ లో కార్ రేసింగ్.. అజిత్ కారుకు ప్రమాదం !

కోలీవుడ్ హీరో అజిత్ మంచి బైక్, కార్ రేసర్ అని తెలిసిందే. దుబాయ్‌లో 11, 12 తేదీల్లో జరగనున్న 24 హెచ్ 2025 ఎండ్యూరెన్స్ కార్ రేసింగ్ ఈవెంట్‌లో అజిత్ పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో ఇవాళ రేసింగ్ ట్రాక్ పై ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన‌గా.. ఆయన కారు ప్రమాదానికి గురైంది.

అజిత్‌ కారు ట్రాక్‌పై వేగంగా వెళ్తుండగా అదుపు తప్పి గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ధ్వంసమైంది. అయితే అజిత్ క్షేమంగా కారు నుంచి బయటకు వచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement