Monday, November 25, 2024

Cannes: ఇండియ‌న్ మూవీల‌కు అపురూప గౌర‌వం… ఉత్త‌మ‌న‌టి ఆవార్డు కూడా మ‌న‌దే..

కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో భారతీయ సినీ ప్రతిభకు మంచి గుర్తింపు లభించింది. వేర్వేరు క్యాటగిరిలో భారతీయులు మూడు అవార్డులు దక్కించుకున్నారు. శనివారం 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌-2024 ముగిసింది. ఇందులో కొత్త దర్శకురాలు పాయల్‌ కపాడియా తెరకెక్కించిన ‘ఆల్‌ వి ఇమాజిన్‌ ఆజ్‌ లైట్‌’ చిత్రానికి గ్రాండ్‌ప్రిక్స్‌ అవార్డు దక్కింది.

ఇది కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ బహుకరించే రెండో అత్యుత్తమ అవార్డు. ఈ అవార్డు అందుకున్న మొదటి భారతీయ మహిళా దర్శకురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. మూడు దశాబ్దాల్లో గ్రాండ్‌ప్రిక్స్‌ అవార్డును దక్కించుకున్న మొదటి భారతీయ సినిమా ఇది.

- Advertisement -

పాయల్‌ కపాడియా ఫిల్మ్‌ ఆండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌టీఐఐ) పూర్వ విద్యార్థిని. ఇక, ‘ద షేమ్‌లెస్‌’ చిత్రంలో తన నటనకు గానూ అనసూయసేన్‌ గుప్తా ‘అన్‌ సైర్టెన్‌ రిగార్డ్‌’ విభాగంలో ఉత్తమ నటి అవార్డును సాధించారు. ఈ అవార్డు అందుకున్న మొదటి భారతీయ నటి ఆమె. ఈ చిత్రాన్ని బల్గేరియా దర్శకుడు కన్‌స్టాన్టిన్‌ బోజనోవ్‌ తెరకెక్కించారు. ప్రొడక్షన్‌ డిజైనర్‌ అయిన అనసూయసేన్‌ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఎఫ్‌టీఐఐ విద్యార్థి చిదానంద ఎస్‌ నాయక్‌ దర్శకత్వం వహించిన ‘సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ధి ఫస్ట్‌ వన్స్‌ టు నో’ చిత్రం స్టూడెంట్‌ డైరెక్టర్‌ విభాగంలో ‘లా సినెఫ్‌’ పురస్కారానికి ఎంపికైంది. చిదానంద నాయక్‌ అవార్డు స్వీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement