Sunday, September 8, 2024

OTT | స్ట్రీమింగ్‌కి వచ్చేసిన “బస్టర్ ది నక్సల్ స్టోరీ”..

ది కేరళ స్టోరీ దర్శక-నిర్మాతలు సుదీప్తోసేన్, విపుల్ అమృత్ లాల్ షాలు తెరకెక్కించిన మూవీ ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’. ఈ మూవీలో అదాశర్మ కీలక పాత్ర పోషించింది. మార్చిలో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా తాజాగా ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ సంస్థ zee5 ద‌క్కించుకోగా.. ఈ రోజు నుండి ఈ సినిమా హిందీతో పాటు తెలుగు భాషలలో అందుబాటులోకి వచ్చింది. సన్‌షైన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకి బిషక్ జ్యోతి సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement