స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రశాంత్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బన్నీ కి లైన్ కూడా ప్రశాంత్ నీల్ చెప్పాడట. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై అభిమానులకు మాత్రం క్లారిటీ లేదు.
ఇటువంటి సమయంలో మెగా ప్రొడ్యూసర్ క్లారిటీ ఇచ్చేశారు. బన్నీ ప్రశాంత్ ల కాంబినేషన్ లో సినిమా కచ్చితంగా ఉంటుందని అయితే స్క్రిప్ట్ ఫైనలైజ్ చేయాల్సి ఉందని బన్నీ వాసు చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని చావు కబురు చల్లగా ప్రమోషన్స్ లో బన్నీవాసు చెప్పడంతో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కే జి ఎఫ్ చాప్టర్2 తో పాటు ప్రభాస్ హీరోగా సలార్ సినిమా చేస్తున్నాడు.